
Latest Telugu Movie News
Telugu Movie news
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్ డిజాస్టర్ గా మారింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలన్నీ తారుమారయ్యాయి. కాగా, రెబెల్ స్టార్ నటించిన తాజా చిత్రం 'ఆదిపురుష్' పైనే అభిమానులు అన్ని అశలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్.. యానిమేషన్ చిత్రానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటంతో అభిమానులు హర్ట్ అయ్యారు.
ఫాన్స్ విషయాన్ని పక్కనబెడితే.. ఈ చిత్ర టీజర్ వీక్షించిన పలు వర్గాలు చిత్ర దర్శకుడు ఓం రౌత్ పై కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఈ టీజర్ చూసి చాలా మంది పెదవి విరువగా.. అనేకమంది చిత్రంలోని వేషాధారణను వ్యతిరేకించారు. హిందువుల ఆరాధ్యదేవుడు శ్రీరాముడి.. రామాయణ గాధను ఇతివృతంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రంలో తమ భావాలను గాయపర్చేలా రూపోందించారని విమర్శలు మొదలయ్యాయి. మరీముఖ్యంగా రావణుడి గెటప్ ను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ స్పందించారు.
ఆదిపురుష్ చిత్ర టీజర్ లో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేశామని.. చిన్ని వీడియోను చూసి ఒక అంచనాకు రావద్దని అన్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల అవుతుందని... సినిమా చూసిన వారెవరూ నిరాశ చెందరని చెప్పారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని అన్నారు. ప్రభాస్ కోసమే రాముడి పాత్రను రాశానని... కథ రాస్తున్నంత సేపు తన మైండ్ లో ప్రభాసే ఉన్నాడని చెప్పారు. ప్రభాస్ కోసం ఈ సినిమాను తెరకెక్కించానని.. ప్రభాస్ నో చెప్పి ఉంటే సినిమా చేసే వాడిని కాదని అన్నారు. ప్రభాస్ నటన అద్భుతంగా ఉందని చెప్పారు.
టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు. రాజబాబు, రేలంగి, పద్మనాభం నుంచి అల్లు రామలింగయ్య, సుత్తి బద్రర్స్.. అక్కడి నుంచి ఏవీఎస్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ వరకు అందరి నుంచి హాస్యాన్ని.. కాదు కాదు.. నవ్వించే తత్వాన్ని అందిపుచ్చుకుని ప్రస్తుతం సినీమాల్లో తనదైన ముద్రవేసుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో వెన్నల కిషోర్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. సినీపరిశ్రమను ఏలిన ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్, తెలంగాణ శకుంతల, ఆహుతి ప్రసాద్ ఇలా కమేడియన్లు వరుసగా నవ్వుల్ని పంచి.. అవే జ్ఞాపకాలను మిగిల్చి.. తిరిగిరాని లోకాలకు వెళ్లగా.. అలాంటి సమయంలో నవ్వించే బాధ్యతలను తనపై వేసుకున్న వెన్నెల కిశోర్ ప్రేక్షకుల మనన్నలను పోందుతున్నాడు. తాజాగా ఆయన 'జిన్నా' సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేశాడు. ఈ సినిమాలో ఆయన 'మైసూర్ బజ్జీ' పాత్రలో కనిపించనున్నాడు.
వెన్నల కిషోర్ పాత్రను పరిచయం చేస్తూ .. ఆయన ఫస్టులుక్ పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఆయన పాత్రలో కామెడీతో పాటు కాస్త రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందనే విషయం ఈ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించాడు. సొంత బ్యానర్ పై విష్ణు నిర్మించిన ఈ సినిమాకి, జి.నాగేశ్వరరెడ్డి కథను అందించగా .. కోన వెంకట్ స్క్రీన్ ప్లే ను సమకూర్చాడు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే జనంలోకి వెళ్లాయి. పాయల్ - సన్నీలియోన్ అందాల సందడి చేసిన ఈ సినిమా, తెలుగు .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్ రోల్ పోషించాడు. నిన్ననే సల్మాన్ ఖాన్ 'గాడ్ ఫాదర్' సక్సెస్ పట్ల చిరంజీవికి శుభకాంక్షలు తెలిపారు. "మైడియర్ చిరు గారూ ఐలవ్యూ" అంటూ ఓ వీడియో సందేశం పంపారు.
తాజాగా చిరంజీవి ఓ వీడియోతో సల్మాన్ ఖాన్ కు బదులిచ్చారు. "థాంక్యూ మైడియర్ సల్లూ భాయ్" అంటూ స్పందించారు. "మీకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే, గాడ్ ఫాదర్ అద్భుత విజయం వెనుక 'మసూద్ భాయ్' ఒక శక్తిలా నిలిచాడు" అంటూ చిరంజీవి కొనియాడారు. "థాంక్యూ... లవ్యూ సోమచ్.. వందేమాతరమ్" అంటూ తన వీడియోలో పేర్కొన్నారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా మోహన్ రాజా మార్పులు చేసి 'గాడ్ ఫాదర్' గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
చిరంజీవి చెల్లెలి పాత్రలో నయనతార, ప్రతినాయక పాత్రలో సత్యదేవ్ ఆకట్టుకున్నారు. బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఈ మల్టీస్టారర్ సినిమాకు హిందీలో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. బాలీవుడ్లో సైతం ఈ చిత్రానికి తొలి మూడు రోజుల్లో మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకుల స్పందన నేపథ్యంలో హిందీలో గాడ్ ఫాదర్ కి ఒక్కసారిగా 600 స్క్రీన్లు పెంచారు. ఈ విషయాన్ని చిరంజీవి వెల్లడించారు. తన చిత్రానికి ఇంత మంచి విజయం కట్టబెట్టిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం 'పొన్నియిన్ సెల్వన్ 1' గత నెల 30న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. పలు అంతర్జాతీయ చిత్రాలు నెలకొల్పిన రికార్డులను బద్దలుకొడుతూ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సునామీని సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన ఎనమిది రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది.
ఇంతటి భారీ వసూళ్లు రాబట్టడం పలు అంతర్జాతీయ చిత్రాల ట్రాక్ రికార్డులు బద్దలయ్యాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం 'పీఎస్1' తొలి వారంలో అద్భుతమైన బిజినెస్ చేసింది. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా తమిళ్, హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే రూ. 325 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ ధృవీకరించారు. ఈ వారాంతంలో రూ. 350 కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేశారు.
'రోబో 2.0', 'కబాలి', 'బిగిల్', 'విక్రమ్' తర్వాత రూ. 300 కోట్ల క్లబ్లో చేరిన ఆరో తమిళ సినిమా ఇదేనని త్రినాథ్ తెలిపారు. 'కబాలి', 'రోబో 2.0' ఓవరాల్ బాక్సాఫీస్ కలెక్షన్లను అధిగమించిన ఈ చిత్రం 'విక్రమ్' రికార్డును కూడా బ్రేక్ చేసే దిశగా ముందుకెళ్తోంది. విదేశాల్లోనూ 'పీఎస్1' హవా కొనసాగుతోంది. యూఎస్ఏలో ఈ చిత్రం 5 మిలియన్ల క్లబ్లో చేరింది. రజనీకాంత్ 'రోబో 2.0' చిత్రం తర్వాత ఈ ఘనత సాధించిన రెండో తమిళ మూవీగా నిలిచింది.
తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో విష్వక్సేన్ ఆయా చిత్రాల ప్రమోషన్ వర్క్ కోసం కూడా తెగ కష్టపడతాడు. అలా గత చిత్ర ప్రమోషన్ వర్క్ లోనే ఆయన కాసింత కాంట్రవర్సీకి కారణమయ్యాడు. ఇక తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. విక్టరీ వెంకటేశ్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు.
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపోందించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. దీపావళి కానుకగా ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం తరువాత కన్నడ భాషల్లో రీమేక్ గా తెరకక్కిన ఈ కథ శాండిల్ వుడ్ ప్రేక్షకులను కూడా అలరించింది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులను సైతం అలరించే విధంగా చిత్రం రూపోందినట్లు.. అందునా విక్టరీ వెంకటేశ్ ఉన్నారని తెలియగానే మినిమమ్ గ్యారెంటీ వచ్చేసినట్టేనని తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓరి దేవుడా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు.
ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది సమయంలోనే ఏకంగా 5 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టి, ట్రెండింగులో నెంబర్ వన్ గా నిలిచింది. జీవితంలో వరుస కష్టాలు ఎదురైనప్పుడు 'ఓరి దేవుడా' ఇవెక్కడి కష్టాలురా నాయనా అనుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక అవకాశాన్ని చేజారిన సందర్భంలో భగవంతుడు మరొక్క ఛాన్స్ ఇస్తే బాగుండునే అనుకోవడం జరుగుతుంది. ఈ రెండు అంశాల చుట్టూనే తిరిగే కథ ఇది. తెలుగులోను ఈ కథకి ఆదరణ లభిస్తుందేమో చూడాలి.
{youtube}v=x4-7tqS1h_Q|620|400|1{/youtube}
తమిళ స్టార్ కార్తి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈయనకు మంచి క్రేజ్ ఉంది. ఇక కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్లు గాని తెలుగులోనే మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘విరుమన్’ తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘సర్దార్’ ఒకటి. ‘అభిమన్యుడు’ ఫేం పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.
స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేస్తుంది. కార్తి విభిన్న గెటప్స్‌లో కనిపించడం క్యూరియాసిటీని పెంచుతుంది. యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఇక జీ.వి ప్రకాష్ నేపథ్య సంగీతం అయితే గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఈ చిత్రంలో కార్తి డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. కార్తికి జోడీగా రాశిఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. లైలా, చంకీ పాండే కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్డూడీయోస్ సంస్థ విడుదల చేస్తుంది.
{youtube}v=Q7vIeBb0fbc|620|400|1{/youtube}
పాన్ ఇండియా హీరో, రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎంత గానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. అయితే షూటింగ్ పూర్తయి నెలలు గడుస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్లు రాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ మేకర్స్‌పై తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో మేకర్స్ ఖుషి చేసేందుకు ఆదిపురుష్ టీజర్ పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా విడుదలై పోస్టర్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. ప్రభాస్.. విల్లును ఆకాశంపైకి ఎక్కిపెట్టి మెరుపులు సృష్టిస్తున్నట్లు పోస్టర్‌ను మేకర్స్ అద్భుతంగా డిజైన్ చేశారు. రాముడి పాత్రలో ప్రభాస్ పర్ఫెక్ట్గా సెట్ అయినట్లు పోస్టర్ చూస్తే తెలుస్తుంది. కాగా ప్రభాస్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు ఆదిపురుష్ టీజర్‌ను అక్టోబర్ 2 ఉదయం 7.11 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. ప్రభాస్‌కు జోడీగా కృతి సనన్ హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు థియేట్రికల్ హక్కులను యూవీ క్రియేషన్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి నటించారన్న మాట చాలు ఆయన అభిమానులు సినిమాను నాలుగు వారాలు గ్యారంటీగా ఆడిస్తారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో చిరంజీవి. సినిమా బాగుందంటే చాలు ఇక ధియేటర్లలో యాభై రోజుల సందడి షురూ. అదే సినిమా బంఫర్ హిట్ అన్న టాక్ వస్తే.. శతదినోత్సవ వేడుకలు గ్యారంటీ.. కానీ అలాంటి నటుడు రీ-ఎంట్రీ ఇచ్చిన తరువాత ఖైదీ నెంబరు 150 మినహాయించి.. మిగిలిన చిత్రాలు అంతగా రాణించలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కినా పిరియాడికల్ చిత్రం సైరా నరసింహరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదని అనిపించినా.. బడ్జెట్ తగ్గట్లు వసూళ్లు రాబట్టలేదు.
ఇక ఆ తరువాత.. ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య.. విడుదల నుంచే నెగిటివ్ టాక్ సోంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు విడుదలయ్యే చిత్రం కచ్చితంగా ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగా ఉండాల్సిందే. అదే మెగా ఫాన్స్ కొరుకుంటున్నారు. కాగా మెగా అభిమానుల ఆశలను అర్థం చేసుకున్న దర్శకుడు మోహన్ రాజా చిరంజీవి కథానాయకుడిగా రూపోందిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమా అందరి అంచనాలను మించినట్టుగా తెరకెక్కిందని చిత్ర ట్రైలర్ చెబుతోంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఎన్వీ ప్రసాద్ - ఆర్.బి. చౌదరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
"ముఖ్యమంత్రి పీకేఆర్ ఆకస్మిక మరణం .. అతని మరణంతో రాజకీయపరమైన డ్రామాలు మొదలుకావడం .. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎవరికివారు వ్యూహాలు పన్నడం .. ఆ పదవికి అన్ని రకాల అర్హతలు వున్న వ్యక్తి" అనే వాయిస్ ఓవర్ పై 'గాడ్ ఫాదర్' ఎంట్రీ .. ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి. 'నేను ఉన్నంతవరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను' అనే చిరూ డైలాగ్ ట్రైలర్ స్థాయిని పెంచింది. 'గాడ్ ఫాదర్'కి అనుకోని సవాళ్లు ఎదురైనప్పుడు అతనికి అండగా నిలిచే సోల్ గా సల్మాన్ ఎంట్రీ చూపించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని ఫైట్స్ .. డాన్స్ మెగా అభిమానులకు పండగ చేస్తాయనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.
{youtube}v=9GPaj0OW-No|620|400|1{/youtube}
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సహధర్మచారిణి, మహేశ్‌బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణవార్తతో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. అమె మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ రంగ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. ఇందిరాదేవి మరణం తననెంతగానో కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘‘ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సూపర్‌స్టార్ కృష్ణ గారికి, సోదరుడు మహేశ్‌బాబుకు, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని చిరు ట్విటర్లో పేర్కొన్నారు.
శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022
చిరంజీవితోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు. ‘‘ఘట్టమనేని కృష్ణగారి సతీమణి, మహేశ్‌బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణం బాధాకరం. ఆమె మృతి సూపర్‌స్టార్ కుటుంబానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ - నందమూరి బాలకృష్ణ
ఇందిరాదేవి మరణంవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురియ్యాను. ఘట్టమనేని కృష్ణ తన జీవిత సహధర్మచారిణిని కోల్పోవడం బాధాకరం. మహేశ్ అన్నకు మాతృవియోగం కలగడం తీరని లోటు. కృష్ణగారికి, మహేశ్ అన్నకు ప్రగాఢ సానుభూతి. ఘట్టమనేని కుటుంబసభ్యులందరికీ తన సంతాపం - నందమూరి తారక్ (జూనియర్ ఎన్టీఆర్)
Deeply saddened by the passing away of Indira Devi Garu. Deepest condolences to Krishna garu, Mahesh anna and family in this time of grief.
— Jr NTR (@tarak9999) September 28, 2022
‘‘ఇందిరమ్మ మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కృష్ణ గారు, మహేశ్‌బాబు, ఇతర కుటుంబసభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ - బాబీ
‘‘మహేశ్‌బాబు తల్లి ఇందిరా దేవి గారు తుదిశ్వాస విడిచారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆ కుటుంబ సభ్యులందరికీ దేవుడు వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’’ - మార్గాని భరత్
‘‘ప్రముఖ నటులు, సూపర్‌స్టార్ కృష్ణగారి సతీమణి ఇందిరాదేవి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ - నారా లోకేశ్
‘‘సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణం బాధాకరం. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించానలి భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ - బండి సంజయ్
‘‘ప్రముఖ నటులు సూపర్ స్టార్ కృష్ణగారి సతీమణి, మహేశ్ బాబు గారి మాతృమూర్తి ఇందిరాదేవి మరణం తీరని లోటు. అమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఘట్టమనేని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఈ విషాదం నుంచి కృష్ణగారు. మహేశ్ బాబు, ఆ కుటుంబసభ్యులు త్వరగా కోలుకోవాలి.’’ - పవన్ కల్యాణ్, జనసేన పార్టీ.
శ్రీ కృష్ణ గారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/5BOY6XCHA6
— JanaSena Party (@JanaSenaParty) September 28, 2022
వీరితో పాటు సాయి ధరమ్ తేజ్, నితిన్, రామ్ పోతినేని, కాజల్ అగర్వాల్, శర్వానంద్, వెంకటేశ్ దగ్గుబాటి, రవితేజ, గోపిచంద్, కీర్తి సురేష్, రానా దగ్గుబాటి, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, దర్శకులు తమ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
టాలీవుడ్లో మరో విషాదం అలుముకుంది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, ప్రిన్స్ మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి ఇవాళ తెల్లవారుజామున పరమపదించారు. అమె మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఇటీవలే 70వ పడిలోకి అడుగుపెట్టిన ఆమె జన్మదినాన్ని కుటుంబసభ్యుల మధ్య జరుపుకున్నారు. అలాంటి ఇందిరాదేవి ఇవాళ హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి మరణంలో ఘట్టమనేని కుటుంబంలో విషాదం అలుముకుంది.
ఘట్టనేని ఇందిరాదేవి మరణంవార్త తెలియడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తమ సంతాపాన్ని సోషల్ మీడియా మాద్యమాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని, ఘట్టమనేని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా కుటుంబసభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఇందిరాదేవి పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఆమెకు తుది నివాళి అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, సినీహీరో వెంకటేశ్ తదితరులు తుది నివాళి అర్పించారు.
వీరితో పాటు దర్శకులు జీవితా రాజశేఖర్, కొరటాల శివ, త్రివిక్రమ్, నటులు మురళీ మోహన్, మోహన్‌బాబు, నిర్మాతలు అశ్వనీదత్, బండ్ల గణేశ్, నందమూరి రామకృష్ణ, తమన్ తదితరులు ఇందిరాదేవికి తుది నివాళి అర్పించారు. కృష్ణ, మహేశ్ సహా ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు. నాన్నమ్మ ఇందిరాదేవి పార్థివదేహాన్ని చూసి మహేశ్ కుమార్తె సితార తట్టుకోలేకపోయారు. మహేశ్ ఒడిలో కూర్చొని కన్నీటి పర్యంతమయ్యింది. తండ్రి ఓదార్చినప్పటికీ దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్చింది. చిన్నారి సితార దుఃఖిస్తుండటం.. అక్కడికి చేరుకున్నవారిని కళ్లు చమర్చేలా చేసింది. కాగా, ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఇందిరా దేవి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Tollywood News (English version)
This week's two releases, 'Skanda' and 'Peddha Kapu', are going to have sequels.
It has been Srikanth Addala's dream to make a trilogy titled 'Annai' (No, 'Peddha Kapu' is not that trilogy).
'How Is That For A Monday?' has been described by writer-director Sripal Sama as the first Indian American film dealing with the story of a first-generation immigrant.
It is rare to see producers gifting high-end cars to their blockbuster directors/heroes.
'Madhurapudi Gramam Ane Nenu' stars Shiva Kantamaneni as the hero.
Chendur Film International is making a film titled 'Hitler' with Vijay Antony as the hero.
'Jandhyala Gari Jatara 2.0' is the title of an upcoming entertainer directed by Valmiki and starring a host of familiar comedy artists.
"Witness the worst of humanity," the trailer for 'Kaliyugam' recently said.
'Engagement', starring Praveer Shetty and Aishwarya Gowdaa in lead roles, is directed by Raaju Bonagaani and produced by Suram Movies in association with Rhodium Entertainments.
About Tollywood
Tollywood refers to the Telugu language film industry. The name derives the concept from Hollywood.Tollywood is based in the state of Andhra Pradesh in southern India. The major Tollywood studios are located in Hyderabad, AP. Tollywood is the largest producer of films in India. In average Tollywood produces between 200 and 250 Telugu movies a year.
Popular movies tend to open during the three festive seasons of the region: Sankranthi, Summer, and Dushera. The Telugu film industry accounts for 1% of the gross domestic product of Andhra Pradesh. Telugu films enjoy significant patronage in the neighboring southern States like Tamil Nadu, Karnataka.
The first Telugu film Bhishma Pratigna was made in 1922 by R.S. Prakash. The first Telugu talkie Bhakta Prahlada, was released in 1931.
Andhra Pradesh is the state having more than 2700 theaters, where Hyderabad alone consists of 150 theatres. It is arguably the state having the largest number of theaters.
For young heroines, waiting for a break in Bollywood - telugu movies are good place to begin with and are considered a gateway. This is because Tollywood is the biggest regional movie market in India and the work there is closely monitored by the big names in Hindi film industry who are on the lookout for storylines to remake and fresh talent be it actors or technicians.